బుల్లితెరపైకి మహేష్ బాబు.. సితారతో గ్రాండ్ ఎంట్రీ! సూపర్ సర్‌ప్రైజ్

సినిమాల్లో తప్ప బయట చాలా అరుదుగా కనిపించే సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ క్రేజీ అడుగేశారు. తన గారాల పట్టి సితార (Sithara)తో కలిసి బుల్లితెరపై సందడి చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కూతురు సితారతో కలిసి జీ తెలుగులో ప్రసారం కానున్న 'డాన్స్ ఇండియా డాన్స్' ప్రీమియం రియాలిటీ షోకు హాజరయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు. కూతురిని అలా వెంటబెట్టుకొని ఆయన నడుస్తూ ఉంటే కెమెరా క్లిక్స్ మోత మోగిపోయింది. సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.

డాన్స్‌ ఇండియా డాన్స్‌ కోసం మహేష్ బాబు సితార కలిసి ఓకే వేదికపైకి రావడం సూపర్ స్టార్ అభిమానులకు కిక్కిస్తోంది. నాకు తెలసి డాన్స్ అనేది సెలెబ్రేషన్. మా అమ్మాయితో కలిసి ఈ షోకు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అని ఈ వేదికపై మహేష్ బాబు చెప్పారు.

సితార తన క్యూట్ స్టెప్స్‌తో ఆకట్టుకుంది. డాన్స్‌ ఎంతో ఇష్టపడే సితార తండ్రి ముందు డ్యాన్స్ చేసి మహేష్ అభిమానులను ఖుషీ చేసింది. దీంతో ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అవుతోంది. సెప్టెంబర్‌ 4న ప్రసారం జీ తెలుగులో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న మహేష్ బాబు అదే జోష్‌లో త్రివిక్రమ్ (Trivikram)తో సినిమా చేస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు)ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

మహేష్ బాబు కెరీర్‌లో 28వ సినిమాగా గ్రాండ్‌గా ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో మహేష్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబోలో వచ్చిన అత‌డు, ఖ‌లేజా సినిమాలు ప్రేక్షకాదరణ పొందటంతో మళ్ళీ అదే కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

షూటింగ్‌ లేని సమయంలో ఫ్యామిలీ కోసమే తన పూర్తి సమయాన్ని కేటాయిస్తుంటారు మహేష్ బాబు. భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సీతారాలతో కలిసి విదేశాలను చుట్టేస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు.